సాయితేజ్ ఇంటర్వ్యూ

Wednesday,December 18,2019 - 02:40 by Z_CLU

‘ప్రతిరోజు పండగే’ సినిమాలో బాధ్యత తెలిసిన మనవాడిలా నటించాడు సాయితేజ్.  తాత చివరి రోజుల్లో ఆయన జీవితంలో తీరకుండా మిగిలిపోయిన కోరికలు తీర్చాలనుకునే యంగ్ స్టర్ లా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.. ఆ ముచ్చట్లు మీకోసం… 

ఆ సినిమా వేరు… ఈ సినిమా వేరు…

‘శతమానం భవతి’ సినిమాకి దీనికి అస్సలు సంబంధం లేదు. అందుకే ఆ విషయాన్ని ట్రైలర్ లోనే క్లారిటీ కూడా ఇచ్చా. ఈ సినిమా మొత్తం… తాత మనవడి బాండింగ్, తాత ఆఖరి రోజుల్లో ఆయన జీవితంలో తీరకుండానే మిగిలిపోయిన కోరికల్ని తీర్చడానికి మనవడు ఎలా ట్రై చేశాడన్నదే ఈ సినిమా. 

టైటిల్ జస్టి ఫికేషన్…

డైరెక్టర్ గారి విజన్ లో మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ పోతే, మనకు నచ్చిన వాళ్ళ మధ్య ఉంటే ‘ప్రతిరోజు పండగే’. ఇక నాకు అనిపించినదేమిటంటే… మనం ప్రతిరోజును పండగ లాగే గడిపితే, చివరికి చావును కూడా హ్యాప్పీగా రిసీవ్ చేసుకోవచ్చు…

నాకు నచ్చిన పాయింట్…

చావు అనేది ఎవరికీ చెప్పి రాదు. కానీ హీరో తాత విషయంలో ఆయన 5 వారాల్లో చనిపోబోతున్నాడని తెలుస్తుంది. అప్పుడు మనవడు ఎలా రియాక్ట్ అవుతాడు…? తాతకోసం ఏం చేస్తాడు..? అనే పాయింట్ నాకు చాలా నచ్చింది.

 అలా చేస్తే చాలు…

మనం పేరెంట్స్ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఇలాంటి ఆరోగ్య సమాస్య ఏదైనా వచ్చినప్పుడు, వాళ్లకు ఆ బాధ తెలీకుండా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయగలిగితే చాలు…

అడ్వంటైజ్ తీసుకున్నా…

నిజానికి ఈ సినిమా కోసం కొంత బరువు తగ్గాల్సి వచ్చింది. ఇక కథకి సిక్స్ ప్యాక్స్ అవసరం లేదు కానీ, ఒక సిచ్యువేషన్ లో హోమం చేయాల్సి వచ్చినప్పుడు ఎలాగూ షర్ట్ లెస్ ఉండాలి. ఆ సిచ్యువేషన్ ని అడ్వంటైజ్ గా తీసుకున్నా…

నేను అస్సలు నటించలేదు…

నేను సినిమాలో అస్సలు నటించలేదు. నేను రియల్ లైఫ్ లో మా తాత గారితో ఎలా ఉన్నానో, ఇప్పుడు సత్యరాజ్ గారితో కూడా అలాగే ఉన్నాను.. న్యాచురల్ బాండింగ్ అనిపించింది సినిమా చేస్తున్నంత సేపు. ఎక్కడా పెద్దగా  నటించాల్సిన అవసరం లేదు.

‘ఉగాది పచ్చడి’ లాంటి సినిమా…

ఈ సినిమాలో జస్ట్ తాత, మనవడి బాండింగ్ ఒక్కటే కాదు. ఉగాది పచ్చడిలా అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. రావు రమేష్ గారి క్యారెక్టర్ ఒక షేడ్ అయితే, టిక్ టాక్ సెలెబ్రిటీలా రాశి ఖన్నా.. ఇలా సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

మారుతి గారితో కనెక్షన్..

మారుతి గారు నాకు 2007 నుండే పరిచయం. అప్పుడు బన్ని కోసం వచ్చేవారు. కానీ ఓ సారి మామూలుగా ఓ ఓ స్టోరీ కూడా చెప్పారు. ఆ కథ ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు కానీ… అప్పట్లో అసలు మేమిద్దరం ఇలా కలిసి సినిమా చేస్తామని కలలో కూడా అనుకోలేదు… 

డైనింగ్ టేబుల్ సీన్…         

సినిమాలో ఒకచోట డైనింగ్ టేబుల్ సీన్ ఉంటుంది. అది చేస్తున్నప్పుడు కంప్లీట్ గా ఇంట్లో ఉన్నట్టే, ఇంట్లో ఉన్నవాళ్ళతో ఉన్నట్టే అనిపించింది. అంత న్యాచురల్ గా ఉంటాయి సినిమాలో సిచ్యువేషన్స్…

మెగాస్టార్ చెప్పిన మాట…

చిత్రలహరి సినిమా మెగాస్టార్ కి చాలా నచ్చింది. ఆ సినిమా తరవాత ఈ కథ చెప్తే,  చాలా బావుంది.. ఈ సినిమాని  ఎలా తీస్తారో… నువ్వెలా చేస్తావో చూడాలని ఉంది అన్నారు.

టైమ్ పట్టింది…

‘చిత్రలహరి’ సినిమా నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కి దగ్గరగా ఉన్న సినిమా. ఆ సినిమా రిలీజ్ తరవాత కూడా నేను ఆ క్యారెక్టర్ లోంచి అంత ఈజీగా బయటికి రాలేదు. ఈ సినిమా చేసేటప్పుడు కూడా అ క్యారెక్టర్ లోనే ఉన్నా… ఆ తరవాత ఫ్రెండ్ గుర్తు చేసి, ఈ క్యారెక్టర్ వేరు.. అది వేరు.. అన్నాడు.. పెద్దగా కష్టమవ్వలేదు కానీ.. కానీ మెంటల్ గా ప్రిపేర్ అవ్వడానికి టైమ్ పట్టింది…

డైరెక్టర్స్ చేతుల్లో ఉంటుంది…

మనం అనుకున్న కథ సరిగ్గా స్క్రీన్ మీద ట్రాన్స్ లేట్ అయితే ఖచ్చితంగా సక్సెస్ దక్కుతుంది. కాబట్టి సినిమా ఫ్యూచర్ ఖచ్చితంగా దర్శకుల చేతుల్లోనే ఉంటుంది.

నేనైతే అదే నమ్ముతా…

పిల్లలకు తమ కరియర్ విషయంలో డెసిషన్ తీసుకునే ఖచ్చితంగా ఉంటుంది. సమస్య వచ్చేదల్లా తల్లి దండ్రుల పట్ల  బాధ్యతలు మర్చిపోయినప్పుడే… సిటీకి వెళ్లి సెటిల్ అవ్వకూడదు.. విదేశాలకు వెళ్ళకూడదు అని కాదు.. వెళ్ళి తల్లిదండ్రులను అవాయిడ్ చేయకూడదు. నేనదే నమ్ముతా…

ఆప్షన్ మారదు…

సక్సెస్ తర్వాతైనా, ఫెయిల్యూర్ తరవాతైనా ఏ సినిమా చేసినా అందరికీ నచ్చే సినిమా చేయాలనే ప్రెజర్ ఎప్పుడూ ఉంటుంది. సిచ్యువేషన్ ని బట్టి ఆప్షన్స్ మారవు..

అప్పుడే తమిళ సినిమా…

ప్రస్తుతానికి ఫోకస్ మొత్తం తెలుగు సినిమాపైనే పెట్టా.. ఇక్కడ కొంచెం సెటిలయ్యాను అనిపించాకే తమిళ, మళయాళ సినిమాల గురించి ఆలోచిస్తా…

రామ్ చరణ్ రీజన్…

ఈ సినిమా కోసం తగ్గుదామని ట్రై చేస్తుంటే, ఇలా చేస్తే తగ్గవురా అని ధృవ టైమ్ లో చరణ్ కి ట్రైనింగ్ ఇచ్చిన రాకేశ్ ఉడియార్ ని రిఫర్ చేశాడు. చరణ్ చెప్పాడు కాబట్టే ఆయన నాకు ట్రైనింగ్ ఇచ్చాడు.

మల్టీస్టారర్ కి రెడీ.. 

మల్టీస్టారర్ సినిమాకి నేనెప్పుడూ రెడీ. వరుణ్ తేజ్ , నేను కూడా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. రవితేజ గారు కూడా అంటూ ఉంటారు. ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని.. కథ రావాలి. అదే లేట్..