సాయి తేజ్ ఇంటర్వ్యూ

Wednesday,April 10,2019 - 06:32 by Z_CLU

సక్సెస్ కోసం స్ట్రగుల్ అయ్యే యంగ్ స్టర్ లా నటించాడు సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ సినిమాలో. ఓ ఐదుగురు వ్యక్తులు ఒక యంగ్ స్టర్ లైఫ్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారనేదే ఈ సినిమా అని చెప్పుకున్న సాయి తేజ్, మీడియా ఇంటరాక్షన్ లో మరిన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం. 

సినిమాలో నా క్యారెక్టర్…

విజయ్ కృష్ణ.. సక్సెస్ అంటే తెలియని క్యారెక్టర్. లైఫ్ లో ఫెయిల్యూర్స్ తప్ప సక్సెస్ చూడని క్యారెక్టర్ లో కనిపిస్తాను. సినిమాలో సక్సెస్ అంటే జాబ్ కాదు… ఒక లక్ష్యం.. దాన్ని సాధించే ప్రాసెస్ లో స్ట్రగుల్, చివరికి  హీరో సక్సెస్ అయ్యాడా లేదా అనేదే సినిమా.

నేనలా ఎప్పుడు అనుకోను…

ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే మనం అక్కడే ఆగిపోతామని కాదు, నా  సినిమాలు కొన్ని అనుకున్నంతగా ఆడకపోయినా, వాటి ద్వారా చాలా నేర్చుకున్నాను.

వైఖరి మారింది…

గతంలో కొంచెం మొహమాటంతో నో చెప్పలేకపోయే వాణ్ణి. ముఖ్యంగా స్క్రిప్ట్ విషయంలో. ఇప్పుడైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి, కాంప్రమైజ్ అయితే రిజల్ట్ అలా ఉంటుంది అని చెప్తున్నా. స్క్రిప్ట్స్ విషయంలో మరింత కేర్ ఫుల్ అయ్యా…

 అదే సినిమా…

ఒక 5 క్యారెక్టర్స్ హీరోని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయన్నదే సినిమా. కిశోర్ గారు కథ చెప్పేటప్పుడే టైటిల్ కూడా చెప్పేశారు. గతంలో ‘చిత్రలహరి’ అనే ప్రోగ్రామ్ ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, సినిమా కూడా అలాగే ఉంటుంది.

నేను చేయగలిగింది అదే…

నేను కథలో చేంజెస్ లాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళను. నేను చేయగలిగిందల్లా ఒకరు నాకు కథ చెప్తే బావుంది అని చేసేస్తాను, లేదా బాలేదు అని తప్పుకుంటాను అంతవరకే. ఒకరు ఎంతో ప్రేమగా రాసుకున్న కథలో మనం ఇన్వాల్వ్ అవ్వడమన్నది కరెక్ట్ కాదు అనే నా ఫీలింగ్… మహా అయితే ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాను.

ఇది అందరి లైఫ్ లో ఫేజ్… 

ఫెయిల్యూర్… సక్సెస్ కోసం పడే స్ట్రగుల్ అనేది అందరి లైఫ్ లో ఒక ఎలిమెంట్… అందుకే రిలీజ్ కి ముందే చాలా మంది ఈ సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు ఇది నా బయోపిక్ లా ఉంది అని  పోస్ట్ లు పెడుతున్నారు. 

అమ్మ కోరిక కూడా…

నేను ఫస్ట్ నుండి DSP మ్యూజిక్ కి పెద్ద ఫ్యాన్. ఆయన కొత్తలో చేసిన సినిమా సాంగ్స్ కూడా నేను చాలా ఎంజాయ్ చేసేవాణ్ణి. నా దగ్గర ఆ సినిమా క్యాసెట్స్ ఇంకా ఉన్నాయి. అమ్మకి కూడా DSP నా సినిమాకి మ్యూజిక్ చేస్తే బావుండేది, ఆయన చేసిన సాంగ్స్ కి నేను డ్యాన్స్ చేయాలని అనుకునేది.. ఈ సినిమాతో కలిసొచ్చింది.

కొరటాల శివ గారు… 

ఈ సినిమాకి పని చేసిన అందరికీ ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కావాలి వేరే ఆప్షన్ లేదు. అందుకే కొరటాల శివ గారు కూడా ఈ సినిమాకి  చాలా సపోర్ట్ చేశారు. కిషోర్ కూడా ఆ మాట చెప్తూ ఉండేవాడు.

వైష్ణవ్ తేజ్ కి… 

తమ్ముడు కదా అని వాణ్ణి ప్రతీది నేనే గైడ్ చేయాలని అస్సలు అనుకోవట్లేదు. వాడికి వాడుగా నేర్చుకోవాలి. మహా అయితే చిన్నగా ఏదైనా గైడెన్స్ ఇస్తానేమో అంతేకానీ, కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వను.