తమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సాయి తేజ్

Tuesday,November 26,2019 - 03:20 by Z_CLU

సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ప్రతి రోజు పండగే’. ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండు పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక  తమన్, సాయి తేజ్ ఫ్రెండ్ షిప్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎంతో ఇష్టమైన తన ఫ్రెండ్ తమన్ కు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ తో నిజంగానే సర్ ప్రైజ్ చేసాడు సాయి తేజ్.

తమన్ మ్యూజిక్ టేస్ట్ కి తగ్గట్టుగా  పెర్ల్ మాలెట్‌స్టేషన్ అనే మ్యూజిక్ ఇన్స్ర్టూమెంట్ గిఫ్ట్ గా అందించాడు సుప్రీం హీరో సాయి తేజ. తనకు సాయి ఇచ్చిన గిఫ్ట్ గురించి  తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్‌ప్రైజ్. సాయి చాలా మంచి వ్యక్తి ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్ లో ఫొటోతో సహా పోస్ట్ చేసాడు.