"సోలో బ్రతుకే.."లో రీమిక్స్ లేదు

Thursday,April 09,2020 - 01:54 by Z_CLU

సాయితేజ్ అంటేనే రీమిక్స్ లకు పెట్టింది పేరు. అతడు నటించిన చాలా సినిమాల్లో రీమిక్స్ పాటలు కనిపిస్తాయి. అయితే ఇకపై రీమిక్స్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు సాయితేజ్. ఇందులో భాగంగా తన అప్ కమింగ్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ లో ఎలాంటి రీమిక్స్ లు లేవని స్పష్టంచేశాడు.

ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ కూడా చెబుతున్నాడు. సోలో బతుకే సో బెటర్ సినిమాలో రీమిక్స్ సాంగ్స్ లేవంటున్నాడు. సాధారణంగా తమన్ కూడా రీమిక్స్ లకు వ్యతిరేకి. దర్శకుడు ఫోర్స్ చేస్తే తప్ప రీమిక్స్ చేయనని గతంలోనే ప్రకటించాడు.

కేవలం సోలో బతుకే సో బెటర్ సినిమాలోనే కాదు.. త్వరలోనే దేవ్ కట్టా దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కూడా ఎలాంటి రీమిక్స్ సాంగ్స్ ఉండవంటున్నాడు సాయితేజ్. దర్శకులు గట్టిగా డిమాండ్ చేస్తే తప్ప, ఇకపై తన సినిమాల్లో రీమిక్స్ ఉండవని గట్టిగా చెబుతున్నాడు.

సాయితేజ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, ఇంటిలిజెంట్ లాంటి సినిమాల్లో రీమిక్స్ సాంగ్స్ చూడొచ్చు.

సుప్రీమ్ ఫుల్ మూవీ కోసం క్లిక్ చేయండి