మారుతి డైరెక్షన్ లో సాయి తేజ్ సినిమా

Sunday,May 12,2019 - 05:11 by Z_CLU

రీసెంట్ గా ‘చిత్రలహరి’ తో హిట్ అందుకున్నాడు సాయి తేజ్. ఈ సినిమా తరవాత దర్శకుడు మారుతి తో సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, మారుతి ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈసారి సాయి తేజ్ తో ఫాదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ప్లాన్ చేసుకున్నాడు మారుతి. సినిమాలో సాయితేజ్ కి ఫాదర్ గా రావు రమేష్ నటించనున్నాడు. ఈ సినిమాని త్వరలో అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు మేకర్స్.

సాయితేజ్ సరసన రష్మిక మండన్న నటించనుంది. UV క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతానికి మ్యూజిక్ డైరెక్టర్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్.