ఎవరైనా నేర్చుకోవాల్సిందే...

Thursday,April 11,2019 - 12:11 by Z_CLU

హీరోగా ఎవరైనా కష్టపడి నేర్చుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కాల్సిందే.. అంటూ లేటెస్ట్ గా  ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు సాయి ధరం తేజ్. అయితే తేజ్ ఇలా అనడానికి ఓ కారణం ఉంది. త్వరలో హీరోగా తెరంగేట్రం చేయబోతున్న తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని ఉద్దేశించే తేజ్ ఇలా మాట్లాడాడు. మీ తమ్ముడు హీరోగా పరిచయం అవుతున్నాడు కదా కెరీర్ పరంగా అతనికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు..? మీ గైడెన్స్ లోనే అతను నడుస్తున్నాడా..? అనే ప్రశ్న కి తేజ్ ఇలా రియాక్ట్ అయ్యాడు.

నిజానికి ఇండస్ట్రీ లో ఎవరైనా కష్టపడి నేర్చుకోవాల్సిందే.. తమ్ముడు కదా అని వాణ్ణి ప్రతీది నేనే గైడ్ చేయాలని అనుకోవట్లేదు. వాడికి వాడుగా అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మహా అయితే చిన్నగా ఏదైనా గైడెన్స్ ఇస్తానేమో అంతేకానీ, కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వను.

తను చేయబోయే సినిమా కథ విన్నాను. తన నెక్స్ట్ సినిమాలకు సంబంధించి కథలు వినమని చెప్తే కచ్చితంగా విని నా ఒపినియన్ చెప్తాను. కానీ ఫైనల్ డిసిషన్ వాడిదే” అంటూ చెప్పుకొచ్చాడు తేజ్.