బంపర్ ఆఫర్ - 2 వస్తోంది

Saturday,March 06,2021 - 11:41 by Z_CLU

* సాయిరాం శంకర్ హీరోగా ‘బంపర్ ఆఫర్ – 2’
*శుభాకాంక్షలు తెలిపిన పూరి జగన్నాథ్
* రాయలసీమ బ్యాక్ డ్రాప్..  దర్శకుడు జయ రవీంద్ర
*ఉగాది శుభాకాంక్షలతో చిత్రం షూటింగ్ ప్రారంభం
*సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్ సంస్థలు సంయుక్త నిర్మాణం

యువ హీరో సాయిరాం శంకర్ హీరోగా గతంలో రూపొందిన ‘బంపర్ ఆఫర్’ చిత్రం, సాధించిన విజయం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు ఆయనే హీరోగా అదే పేరును కొనసాగిస్తూ ‘బంపర్ ఆఫర్ – 2’ పేరుతో ఓ సినిమా వస్తోంది.

సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్ సంయుక్త నిర్మాణంలో సాయిరాం శంకర్ హీరోగా సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్ లు నిర్మాతలుగా ‘బంపర్ ఆఫర్ 2’ చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు.

‘బంపర్ ఆఫర్’ విజయం నేపథ్యంలో 12 సంవత్సరాల తర్వాత అదే పేరు మీద రెండవ భాగం చేస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నారు. ‘బంపర్ ఆఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగాని కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. చిత్రం లోని హీరోయిన్స్ మరియు ఇతర తారాగణం,సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సురేష్ యల్లంరాజు. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.