శర్వానంద్ హీరోయిన్ గా సాయిపల్లవి

Thursday,December 28,2017 - 01:36 by Z_CLU

 ఫిదా సినిమాతో టాలీవుడ్ లో సొంత మార్క్ క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి, MCA సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరయింది. ఈ సక్సెస్ స్పీడ్ లో హను రాఘవపూడి సినిమాకు సంతకం చేసిన సాయి పల్లవి శర్వానంద్ హీరోయిన్ గా కనిపించనుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

 

రీసెంట్ గా ‘లై’ మూవీతో ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ అనిపించుకున్న హను రాఘవపూడి, ఇప్పుడు తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కనుంది. జనవరి 20 నుండి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ త్వరలో అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.