సాయిపల్లవి ఇంకా సైలెంట్ గా ఉంటే కుదరదు

Monday,March 11,2019 - 03:02 by Z_CLU

‘ఫిదా’ సినిమాతో అందరూ ఫిదా అయ్యేలా చేసుకుంది. అదే సంవత్సరం నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాతో మరింత దగ్గరయింది. ఆ తరవాత వచ్చిన ‘కణం’ తో సాయి పల్లవి జస్ట్ కమర్షియల్ హీరోయినే కాదు. కథ బావుండాలి కానీ, పెద్దగా హడావిడి లేని సినిమాలో కూడా నటించేస్తుందనిపించింది. కానీ ‘పడి పడి లేచే మనసు’ సినిమా తర్వాతే సాయి పల్లవి ఎందుకిలా చేస్తుందనిపిస్తుంది.

‘పడి పడి లేచే మనసు’ బాక్సాఫీస్ దగ్గర ఆవరేజ్ అనిపించుకున్నా, సాయి పల్లవి పై క్రేజ్ తగ్గనివ్వలేదు. అదే సిచ్యువేషన్  ‘మారి 2’ కి కూడా రిపీట్ అయింది. అయినా ఫ్యాన్స్ పై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కానీ వచ్చిన అసలు సమస్యల్లా సాయి పల్లవి సందడి తగ్గటమే. అసలెక్కడా సాయి పల్లవి పేరు కూడా వినిపించకపోవడం, నెగెటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి.

 

ఎప్పుడో అక్టోబర్ లో సినిమా రిలీజైతే ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమా రిలీజవ్వకపోవడం ఇక్కడ సమస్య కాదు, ఇంకా కనీసం ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాకపోవడం సమస్య. ఓ వైపు ఇంతమంది స్టార్ హీరో సినిమాలు అనౌన్స్ అవుతుంటే,  అందులో కనీసం కన్సిడరేషన్ టేబుల్ పై కూడా సాయి పల్లవి పేరు లేకపోవడం ఆలోచించాల్సిన విషయమే. ఒక్క మాటలో చెప్పాలంటే బన్ని, మహేష్ బాబు లాంటి స్టార్స్ సినిమాల్లో సాయి పల్లవి పేరు కనీసం గాసిప్ లా కూడా వినిపించడం లేదు.

సూర్య సరసన నటించిన ‘NGK’ రిలీజ్ కి రెడీ అవుతున్నా, సాయి పల్లవి మరో కొత్త సినిమాతో వైబ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా అవసరమే. ఫ్లాప్స్, హిట్స్ కామనే అయినా సాయి పల్లవి ఈ సైలెన్స్ ని ఇప్పట్లో బ్రేక్ చేయాల్సిన అవసరమైతే చాలా ఉంది.