‘కణం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Monday,February 26,2018 - 12:21 by Z_CLU

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘కణం’ ఫస్ట్ సింగిల్ రిలీజైంది. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసింది. దానికి తోడు అల్టిమేట్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమాలోని ఈ ఫస్ట్ సింగిల్ సినిమాలోని లవ్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తుంది.

‘సంజాలి… ’ అంటూ సాగే ఈ సాంగ్, సినిమాలో పెళ్ళి సందర్భంలో ఉండబోయే సాంగ్ అని తెలుస్తుంది. అరవింద్ శ్రీనివాస్, అనూ ఆనంద్ కలిసి పాడిన ఈ సాంగ్ కి కృష్ణ మాదినేని ఈ పాటకి లిరిక్స్ రాశాడు. ‘నిను చూసి ఎన్నెలంతా అలిగెళ్ళి పోదా…’ అంటూ సింపుల్ గా ఉన్న లిరిక్స్ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

విజయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి శ్యామ్ C.S. మ్యూజిక్ కంపోజ్ చేశాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు లో N.V.ప్రసాద్ సమర్పిస్తున్నారు.