సాయి పల్లవి ఇంటర్వ్యూ

Wednesday,July 26,2017 - 01:57 by Z_CLU

‘ప్రేమమ్’ సినిమాతో మలర్ గా ఎట్రాక్ట్ చేసిన సాయి పల్లవి రీసెంట్ గా ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భానుమతి గా తన పర్ఫార్మెన్స్ తో ఫిదా చేసింది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సందర్భంగా ఫిదా బ్యూటీ మీడియాతో ముచ్చటించింది. ఆ మాటలు సాయి పల్లవి మాటల్లోనే..

 

నా బ్యాగ్రౌండ్

మాది చాలా క్యూట్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, నేను చెల్లి అంతే. కానీ రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. ఊటీ దగ్గర కోటగిరి నుంచి వచ్చాను.

 

ఆ క్రెడిట్ శేఖర్ గారికే దక్కుతుంది

ఈ సినిమాలో తెలంగాణలో డైలాగ్స్ చెప్పడం కోసం చాలా కేర్ తీసుకున్నా. ఒక్కో డైలాగ్ చాలా సార్లు చదువుకుంటూ ఆ డైలాగ్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకూ ట్రై చేసే దాన్ని. డైలాగ్ పర్ఫెక్ట్ గా రాకపోతే ఆ ఎఫెక్ట్ ఫేస్ మీద పడుతుందని నా ఫీలింగ్. శేఖర్ గారు ఈ క్యారెక్టర్ చెప్పేటప్పుడే తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడాలని అన్నారు. అప్పటి నుంచే కొంచెం వర్క్ చేశాం. డబ్బింగ్ టైం లో కూడా ప్రతీ డైలాగ్ కి చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాను. సినిమాలో నేను చెప్పిన డైలాగ్స్ కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని విన్నాను. చాలా హ్యాపీ గా ఉంది. ఆ క్రెడిట్ శేఖర్ గారికే దక్కుతుంది.తెలుగులో నా డెబ్యూ మూవీకి ఇంత రెస్పాన్స్ అస్సలు ఊహించలేదు. అందరికీ స్పెషల్ థాంక్స్.


ఇక్కడ అది అవసరం

మలయాళం మూవీస్ చేసినప్పుడు జస్ట్ నేచురల్ గానే యాక్ట్ చేశాను. ఆ రోల్ కి వర్క్ షాప్ అవసరం లేదు. కానీ ఫిదా కి వచ్చే సరికి భానుమతిగా నటించడానికి వర్క్ షాప్ అవసరం అనిపించింది. శేఖర్ గారితో, వరుణ్ తో కలిసి వర్క్ షాప్ లో పాల్గొన్నాను. అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. ఈ రోజు భానుమతి క్యారెక్టర్ కి ఇంత రెస్పాన్స్ వస్తుందంటే దానికి రీజన్ నేను చేసిన వర్క్ షాప్.

 

ఊహించని రోల్

నిజానికి నటిగా కొన్ని రోల్స్ ఊహించుకుంటాం. కానీ నేను అస్సలు ఊహించని రోల్ భానుమతి. అందుకే బెస్ట్ ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడ్డాను. పర్సనల్ గా కూడా ఈ రోల్ ద్వారా చాలా నేర్చుకున్నాను.

 

అందుకే లేట్ అయిందేమో

‘డీ’ షో తర్వాత తెలుగులో హీరోయిన్ గా కొన్ని ఆఫర్స్ వచ్చాయి. ప్రేమమ్ తో పేరు రావాలని… ఫిదాతో తెలుగులో డెబ్యూ అవ్వాలని రాసుంది కాబట్టి ఇలా జరిగింది. తెలుగు లో నా డెబ్యూ కి ఇంత రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు.

 

రీమేక్ ఇంట్రెస్ట్ లేదు

రీమేక్ లో నటించడం, చేసిన రోల్ మళ్ళీ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ అక్కడ అదే రెస్పాన్స్ వస్తుందో లేదో తెలియనప్పుడు రిస్క్ చేయడం ఎందుకని నా ఫీలింగ్. చేసిన రోల్ చేయలేను. ఇప్పుడు ఫిదా కూడా మళ్ళీ చేయమంటే నో చెప్పేస్తా.

అంత లేదు

నిజానికి భానుమతి లౌడ్ క్యారెక్టర్. నిజజీవితంలో ఎక్కువ మాట్లాడతాను కానీ మరీ అంత కాదు. అలా బూతులు మాట్లాడటం అంత లౌడ్ గా మాట్లాడటం ఉండటం ఉండదు(నవ్వుతూ). జస్ట్ సింపుల్ అండ్ క్వైట్ గా ఉంటాను.

 

అది నా అదృష్టం

సినిమాలో మేకప్ వేసుకొని యాక్ట్ చేయడం ఇష్టం ఉండదు. వీలైనంత వరకూ నేచురల్ గా కనిపించడానికి ఇష్టపడతాను. ఇప్పటివరకూ నాకు వచ్చిన రోల్స్ తో పాటు డైరెక్టర్స్ కూడా నన్ను నేచురల్ గా చూపించడానికే ఇష్టపడ్డారు. ప్రేమమ్ అప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా అనుకున్నాను. కానీ మలర్ క్యారెక్టర్ ని అంత మంది ఇష్టపడటానికి ఆ పింపుల్స్ నేచురాలిటీనే కారణం. ఆ సినిమా తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. సాధ్యమైనంత వరకు మేకప్ లేకుండానే కనిపించడానికి ట్రై చేస్తాను.

 

అప్పటి వరకూ

రీసెంట్ గా ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ప్రస్తుతానికి సినిమాల మీదే ఫోకస్. ఎప్పటి వరకూ నేను సినిమాల్లో కనిపించాలని ఆడియన్స్ కోరుకుంటారో అప్పటివరకు నటిగానే కొనసాగుతాను. కార్డియాలజీ కూడా చేయాలని ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తాను.

 

నా బాడీ లాంగ్వేజ్ పై డౌట్

బేసిక్ గా డాన్స్ అంటే చాలా ఇష్టం. డీ షో ద్వారా చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో డాన్స్ చేయాలని చెప్పినప్పుడు నా బాడీ లాగ్వేజ్ కి ఎలా కుదురుతుందో అనుకున్నాను. కానీ శేఖర్ మాస్టర్ బాగా కొరియోగ్రఫీ చేశారు. ఫిదాలో “వచ్చిందే..” సాంగ్ లో నా డాన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ క్రెడిట్ శేఖర్ మాస్టర్ దే.

 

అందుకే ఆ సినిమా చేశాను

మెడిసిన్ చదువుతుండగా కొన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ చేయలేకపోయాను. ఫైనల్ గా 4th ఇయర్ లో ఉండగా ప్రేమమ్ ఆఫర్ వచ్చింది. సో కాలేజ్ స్కిప్ చేసి ఆ సినిమా చేశాను. ఆ తర్వాత మళ్ళీ స్టడీస్ పై ఫోకస్ పెట్టాను.

సూర్య అంటే చాలా ఇష్టం

సినిమాలు చాలా తక్కువగా చూస్తా. సూర్య నటించిన ‘కాక-కాక’ సినిమా చూశాను. అప్పటి నుంచి సూర్య అంటే చాలా ఇష్టం.

 

సినిమా పూర్తయింది

నాగశౌర్యతో తెలుగులో ఓ సినిమా చేస్తున్నా. రీసెంట్ గా ఆ సినిమా ఫినిష్ అయింది. అందులో ఒక కాలేజ్ స్టూడెంట్ రోల్ చేస్తున్నాను. అది కూడా లవ్ ఎంటర్టైనర్. ఆ సినిమా కూడా నాకు ఒక మంచి ఎక్స్ పీరియన్స్.

 

ప్రెజెంట్ రెండు సినిమాలు

తెలుగులో నానితో ఎంసీఏ సినిమాతో పాటు తమిళ్ లో ఒక సినిమా చేస్తున్నాను. రెండు షూటింగ్స్ జరుగుతున్నాయి. సో ఒక తమిళ్, సినిమా ఒక తెలుగు సినిమాతో బిజీ అయిపోయా.