లవ్ స్టోరీ మూవీ నుంచి సాయిపల్లవి బర్త్ డే పోస్టర్

Saturday,May 09,2020 - 12:54 by Z_CLU

భానుమ‌తిగా ఫిదాతో మెస్మరైజ్ చేసిన సాయి ప‌ల్ల‌వి… శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు ల‌వ్ స్టోరీతో సిద్దం అవుతుంది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి క్రేజీ కాంబినేష‌న్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచింది. ఇప్పటికే విడుద‌లైన ఫస్ట్ లుక్, ‘‘ఏయ్ పిల్లా’’ సాంగ్ కు విశేష‌మైన స్పంద‌న ల‌భించింది. తాజాగా సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.

హీరోయిన్ సాయిపల్లవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో సాయి ప‌ల్ల‌వి మ‌రింత అందంగా క‌నిపించింది. వర్షంలో ఆడుతున్న సాయి పల్లవి స్టిల్ కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ల‌వ్ స్టోరీ కి ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. లాక్ డౌన్ త‌ర్వాత బ్యాలెన్స్ షూటింగ్ ప్లాన్ చేశారు. ‘‘లవ్ స్టోరీ’’ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
ఆర్ట్: రాజీవన్
పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల