సాయిపల్లవి కొత్త సినిమా రిలీజ్ డేట్

Wednesday,October 16,2019 - 11:02 by Z_CLU

సాయి పల్లవి మలయాళంలో నటించిన ‘అథిరన్’ సినిమా ‘అనుకోని అతిథి’గా తెలుగులో రిలీజవుతుంది. ప్రస్తుతం ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న మేకర్స్ నవంబర్ 5 న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి మతి స్థిమితం లేని అమ్మాయిగా కనిపించనుంది.

కేరళలో 1970 లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఒకే రోజున ఒక ఫ్యామిలీలో జరిగిన మర్డర్స్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మళయాళ హీరో ఫాహద్ ఫాసిల్ కీ రోల్ ప్లే చేశాడు.

P.S. జయహరి, జిబ్రాన్ ఈ సినిమాకి సంయుక్తంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. వివేక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ నిర్మించారు.