సాయి కార్తీక్ ఇంటర్వ్యూ...

Monday,October 16,2017 - 04:35 by Z_CLU

V4 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నవంబర్ 3 న రిలీజ్ కి రెడీ అవుతున్న ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాలోని 3 సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడంతో, సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్న సాయి కార్తీక్, ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలు చెప్పుకున్నాడు ఆ ఇంటరెస్టింగ్ చిట్ చాట్ మీకోసం…

2017 బెస్ట్ ఇయర్…

ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలు చేశాను… పైసా సినిమా నా కరియర్ కి టర్నింగ్ పాయింట్ అయితే ‘నెక్స్ట్ నువ్వే’ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్ కమర్షియల్ మ్యూజిక్ కంపోజర్ అనిపించుకునే ట్రాక్ లో పడ్డట్టనిపిస్తుంది.

నెక్స్ట్ నువ్వే సినిమాకి చాన్స్ ఎలా వచ్చింది..?

శ్రీరస్తు శుభమస్తు సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఇకపోఅతే బన్ని వాసు గారు సౌండ్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారు. నెక్స్ట్ నువ్వే సెకండాఫ్ లో హారర్  ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక అలాంటి సిచ్యువేషన్స్ BGM ఇంపాక్ట్ చాలా ఉంటుంది. నాకు సాంగ్స్ కన్నా BGM చాలా గ్రిప్ ఉంటుంది. అలా ఈ చాన్స్ వచ్చింది.

అదృష్టమనే చెప్పాలి…

నెక్స్ట్ నువ్వే సినిమాలో ఉన్నది 2 సాంగ్సే అయినా, చాలా మంచి పేరు వచ్చింది. ఆ సాంగ్స్ అంతలా ఎలివేట్ అవ్వడానికి రీజన్, సినిమాలో ఉండే కంటెంట్. ఇలాంటి సినిమా చేసే చాన్స్ రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి…

BGM ఫాంటాస్టిక్ గా రావడానికి రీజన్ అదే…

నాకు తెలిసి BGM సినిమాకు ప్రాణం లాంటిది. సినిమాలోని కంటెంట్ పై మ్యూజిక్ ఇంపాక్ట్ ఎంతలా ఉంటుందంటే కళ్ళు మూసుకుని BGM వింటే అక్కడ హీరో పరుగెడుతున్నారా..? లేక కమెడియన్ అనేది తెలిసిపోతుంది. అందుకే నేను సాంగ్స్ కన్నా BGM పైనే ఎకువ దృష్టి పెడతాను.

మాది మ్యూజికల్ ఫ్యామిలీ…

మా అమ్మానాన్న ఇద్దరూ సింగర్ సే.. ఒంగోలు లో ఆర్కెస్ట్రా ఉండేది… నేను 4th క్లాస్ లో ఉన్నప్పటి నుండే లైవ్ ప్రోగ్రామ్స్ చేయడం అలవాటు.. నా వైఫ్ నా ప్రతి సినిమాలో పాడుతుంది. నాకు స్త్రెంత్ కూడా నా ఫ్యామిలీ నే. ఒక సాంగ్ తను పాడితే సూట్ అవుతుందనిపిస్తే కన్ఫంగా పెట్టేస్తా… పిల్లలు కూడా రాజా చెయ్యి వేస్తే, రాజుగారి గది, పైసా సినిమాల్లో పాడారు.

నాకు తెలిసింది మ్యూజిక్ ఒకటే…

కాల్ సెంటర్ సినిమాతో నా కరియర్ బిగిన్ అయింది. అప్పటి నుండి చిన్నా, పెద్దా సినిమా అని తేడా లేకుండా సినిమాలు చేస్తున్నాను. అందుకే 60 సినిమాలు కంప్లీట్ చేయగలిగాను… ఒక్క ఈ సంవత్సరమే కాస్త సెలెక్టివ్ గా  సినిమాలు చేస్తున్నాను. ఈ ఇయర్ ఇప్పటికే 6 సినిమాలు చేశాను..

వాళ్ళే నా డ్రీమ్ డైరెక్టర్స్…

టాప్ 5 డైరెక్టర్స్ తో చేయాలని ఉంది. ముఖ్యంగా ఫీల్ వైజ్ మణిరత్నం గారితో, యాక్షన్ వైజ్ శంకర్ గారితో చేయాలని డ్రీమ్.