తేజ్ వచ్చే డేట్ ఫిక్స్ అయింది

Wednesday,May 23,2018 - 06:30 by Z_CLU

సరికొత్త మేకోవర్ లో సాయిధరమ్ తేజ్ ఎలా ఉన్నాడో చూడాలని ఉందా..? తేజు-అనుపమ పెయిర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడ్డానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా..?  సరిగ్గా జూన్ 29 వరకు మీరు వెయిట్ చేస్తే చాలు. అవును.. తేజ్ – ఐ లవ్ యు సినిమాను వచ్చేనెల 29న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ డైరక్ట్ చేసిన సినిమా ఇది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై  కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించాడు. త్వరలోనే ఈ సినిమా సాంగ్స్ ను విడుదల చేస్తారు.

సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో ఇదే మొదటి సినిమా. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.