Republic రిలీజ్ డేట్ లాక్ !
Monday,February 01,2021 - 06:55 by Z_CLU
సాయి ధరం తేజ్ , దేవకట్టా కాంబినేషన్ లో రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘రిపబ్లిక్‘ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సినిమాను జూన్ 4న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు.
గతంలో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ‘ప్రస్థానం’ తీసి అందరినీ మెప్పించిన దర్శకుడు దేవకట్టా ఈ సినిమాతో మరోసారి తన మార్క్ తో పక్కా పొలిటికల్ థ్రిల్లర్ చూపించబోతున్నాడు. సినిమాలో వచ్చే పొలిటికల్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని క్లాప్స్ కొట్టిస్తాయని ఇన్సైడ్ టాక్. రీసెంట్‌గా విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.

జీ స్టూడియోస్ సంస్థతో కలిసి జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు , రమ్య కృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.