తొలిసారిగా కొత్త దర్శకుడితో

Monday,August 12,2019 - 06:14 by Z_CLU

కెరీర్ లో ఇప్పటివరకు కొత్త దర్శకుడ్ని పరిచయం చేయలేదు మెగా హీరో సాయి తేజ్. ఎట్ లీస్ట్ ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరక్టర్ తోనైనా చేశాడే తప్ప ఓ కొత్త ముఖాన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇన్నాళ్లకు తేజూ ఆ పని చేస్తున్నాడు. సుబ్బు అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నాడు.

గతంలో ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి సినిమాలకు వర్క్ చేశాడు సుబ్బు. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాసుకున్నాడు. ఆ స్టోరీ సాయి తేజ్ కు బాగా నచ్చింది. వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు నిర్మాత.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజు పండగే అనే సినిమా చేస్తున్నాడు తేజూ. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే సుబ్బు దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వస్తుంది. రీసెంట్ గా చిత్రలహరి సినిమాతో ఈ మెగా హీరో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.