శరవేగంగా సిద్ధమౌతున్న విన్నర్

Sunday,November 27,2016 - 11:27 by Z_CLU

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న `విన్న‌ర్‌` చిత్రం ఫారిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.  గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవ‌లే ఈ చిత్రం ఫారిన్ షెడ్యూల్ పూర్త‌యింది. న‌వంబ‌ర్ 3 నుంచి 20 వ‌ర‌కు ఉక్రెయిన్‌లో  పాట‌ల్ని షూట్ చేశారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ మీద 2 పాట‌ల్ని, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, యాంక‌ర్ అన‌సూయ మీద ఒక పాట‌ను చిత్రీక‌రించారు. రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ చేశారు. ట‌ర్కీలోని ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్ కి సంబంధించిన యాక్ష‌న్ పార్ట్ ను చిత్రీక‌రించారు. బ‌ల్గేరియ‌న్ ఫైట్ మాస్ట‌ర్ క‌ల‌యాన్ ఆధ్వ‌ర్యంలో  యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తీశారు. `బాహుబ‌లి`లో మంచు కొండల్లో జ‌రిగే యాక్ష‌న్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించింది క‌ల‌యాన్ మాస్టరే కావ‌డం విశేషం.

cw-2kvnweaaj97n

డిసెంబ‌ర్ 6 నుంచి 22 రోజుల పాటు ఊటీ, బెంగుళూరులో షెడ్యూల్ జ‌రుగుతుంది. జ‌న‌వ‌రిలో బ్యాల‌న్స్ టాకీ, రెండు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తే… సినిమా మొత్తం పూర్త‌వుతుంది. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న చిత్రాన్ని విడుద‌ల చేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.