ఫిబ్రవరి 9న సాయిధరమ్‌తేజ్‌ కొత్త సినిమా రిలీజ్

Monday,December 18,2017 - 07:38 by Z_CLU

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటల షూటింగ్ కోసం మస్కట్ వెళ్లింది యూనిట్.

ఈరోజు నుంచి 28 వరకు ఈ రెండు పాటల్ని మస్కట్ లో షూట్ చేస్తారు. ఈ పాటలకు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్లు. ఈ షెడ్యూల్ తో క్లయిమాక్స్ మినహా టోటల్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయాలని నిర్ణయించారు. సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

కథ, మాటలు: శివ ఆకు
సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌
సంగీతం: థమన్‌
ఎడిటింగ్‌: గౌతంరాజు
ఆర్ట్‌: బ్రహ్మ కడలి
ఫైట్స్‌: వెంకట్‌
డాన్స్‌: శేఖర్‌, జాని
నిర్మాత: సి.కళ్యాణ్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌