మరో స్టైలిష్ ఎంటర్ టైనర్ కి రెడీ అవుతున్న తేజ్

Monday,May 28,2018 - 12:42 by Z_CLU

కరుణాకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘తేజ్ I love u’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉన్న తేజ్, త్వరలో దర్శకుడు కిశోర్ తిరుమలతో సెట్స్ పైకి వచ్చేస్తాడు. అయితే ఈ సినిమా ఇంకా బిగిన్ కూడా అవ్వలేదు. అప్పుడే మరో సినిమాను లాంచ్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు ఈ హీరో. ‘విన్నర్’ దర్శకుడు గోపీచంద్ మాలినేని సినిమాను మ్యాగ్జిమం జూలై లో లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాడు తేజ్.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు గోపీచంద్ మాలినేని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాడు. ఈ సారి సెట్స్ పైకి రానున్న ఈ సినిమా స్టోరీలైన్ లాంటి డీటేల్స్ అయితే బయటికి రాలేదు కానీ, ఫ్యాన్స్ మాత్రం ఈ సారి మరో లావిష్ & స్టైలిష్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

భగవాన్ తో పాటు J. పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన తక్కిన కాస్టింగ్ తో పాటు, టెక్నీషియన్స్ డీటేల్స్ తెలియాల్సి ఉంది.