సిక్స్ ప్యాక్ లో సాయితేజ్

Friday,December 13,2019 - 06:07 by Z_CLU

తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో మెగాహీరో సాయితేజ్ కూడా చేరాడు.

సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న `ప్రతీ రోజు పండ‌గే` ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు.

సాయి తేజ్ హోమం చేస్తుండగా వచ్చే యాక్షన్ సీన్, ఆ సీన్‌లో హీరో షర్ట్ లేకుండా ఫైట్ సీక్వెన్స్ లో సిక్స్ ప్యాక్ లో తేజ్ కనిపిస్తాడు. కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కోసం ఫిట్‌నెస్‌ ట్రైనర్ సాయంతో చాలా కష్టపడి, వర్కౌట్ చేసి ఈ లుక్ కు మారాడు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో సాయి తేజ్ కు జోడిగా రాశిఖన్నా నటించింది.