సాయిధరమ్ తేజ్ ఇమోషనల్ లవ్ జర్నీ

Monday,June 25,2018 - 07:32 by Z_CLU

‘తేజ్ I love u’ ట్రైలర్ రిలీజయింది. సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే యూత్ లో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు ఈ రోజు రిలీజైన ఈ ట్రైలర్ ఓవరాల్ గా సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది.

‘అమ్మాయిల్ని పడేయడం చాలా ఈజీ..’ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయ్యే ఈ ట్రైలర్ టీజింగ్ తో బిగిన్ అయి, లవ్ ఎలిమెంట్స్ తో పాటు ఇమోషనల్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేస్తుంది. అల్టిమేట్ గా హీరోయిన్ ని ఇంప్రెస్ చేయాలన్న ప్రాసెస్ లో, అబద్ధాలు చెప్పి దగ్గరైన హీరో, జెన్యూన్ గా తన లవ్ లో సక్సెస్ అవ్వడానికి ఏం చేసి ఉంటాడు..? అనే క్యూరాసిటీని రేజ్ చేస్తుంది.

ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసినట్టు ‘తేజ్ I love u’ పక్కా ఇమోషనల్ లవ్ జర్నీ లా తెరకెక్కిందనిపిస్తుంది. K.S. రామారావు నిర్మించిన ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. జూలై 6 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజవుతుంది. కరుణాకరన్ ఈ సినిమాకి డైరెక్టర్.