‘తేజ్ I love u’ రిలీజ్ డేట్ మారిందా...?

Monday,June 11,2018 - 04:38 by Z_CLU

కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మోస్ట్ ఇంటెన్సివ్ లవ్ ఎంటర్ టైనర్ తేజ్ ‘I love u’. ఈ సినిమా ఈ నెల 29 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిందనే న్యూస్ టాలీవుడ్ తో పాటు పాటు సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా జూలై ఫస్ట్ వీక్ లో రిలీజవుతుందని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాయి. దానికి తోడు కరుణాకరన్ మార్క్ ఇమోషనల్ లవ్ ఎలిమెంట్స్ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అంతలో రిలీజ్ డేట్ లో మార్పు అనగానే న్యాచురల్ గానే అందరి కాన్సంట్రేషన్ ఈ సినిమాపై మళ్ళింది.

ఈ విషయంలో ఫిల్మ్ మేకర్స్ నుండి ఎటువంటి అప్ డేట్ అయితే రాలేదు. K.S. రామారావు నిర్మించిన ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ విషయంలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.