సాయి ధరమ్ తేజ్ ‘తేజ్ I love u’ ఫస్ట్ లుక్

Saturday,April 28,2018 - 05:45 by Z_CLU

కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సాయి ధరమ్ తేజ్ సినిమాకి ‘తేజ్ I love u’ అని టైటిల్ ఫిక్స్ చేశారు ఫిల్మ్ మేకర్స్.   అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజయింది. ఇప్పటికే కమర్షియల్ హీరోగా ఫ్యాన్స్ లో క్రేజ్ క్రియేట్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్, ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫెరెంట్ ఆంగిల్ లో కనిపించనున్నాడు.

ఇప్పటికే 2 పాటలుమినహా తక్కిన షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్, మే ఫస్ట్ వీక్ లో ఫ్రాన్స్ లో ఈ 2 పాటల్ని తెరకెక్కించనున్నారు.  ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.

 

క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై K.S. రామారావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. సైమల్టేనియస్ గా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫాస్ట్ పేజ్ లో జరుపుకుంటున్న సినిమా యూనిట్, మే 1 న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనుంది.