Sai Dharam Tej - మెగాహీరోకు కరోనా సోకిందా!

Wednesday,October 07,2020 - 02:11 by Z_CLU

“మెగా హీరో Sai Dharam Tej కు Corona సోకిందట.
ఆయన ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్నారట.”
నిన్నట్నుంచి సాయితేజ్ పై వచ్చిన రూమర్ ఇది. ఈ రూమర్ స్టార్ట్ అయిన కొన్ని గంటలకే తనదైన స్టయిల్ లో క్లారిటీ ఇచ్చాడు ఈ మెగా హీరో.

డైరక్టర్ Deva Katta తో కలిసి సీరియస్ గా ఏదో రాస్తున్న ఫొటోను పోస్ట్ చేశాడు సాయితేజ్. దేవకట్టాతో కలిసి చేయబోతున్న సినిమాకు ప్రిపరేషన్ మొదలుపెట్టానంటూ ట్వీట్ చేశాడు.

ఇలా తనపై వచ్చిన పుకార్లకు, కొత్త సినిమా అప్ డేట్ తో చెక్ పెట్టాడు సాయితేజ్. Pawan Kalyan చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమాలో నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు