తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ - Sai Tej

Saturday,December 26,2020 - 07:22 by Z_CLU

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’. నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ అసోసియేష‌న్‌తో క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబ‌ర్‌ 25న రిలీజైంది.

సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సాయి ధరమ్ తేజ్ హ్యాపీగా ఉన్నాడు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు, సినిమాను సపోర్ట్ చేసిన టాలీవుడ్ కు థ్యాంక్స్ చెప్పాడు.

తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోలు, డైరెక్టర్స్‌, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ సహా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా నిర్మాతలు సినిమాను ఈ సమయంలో విడుదల చేద్దామని అనుకున్నప్పటికీ అందరూ సపోర్ట్‌ చేయడంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగాం. డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ .. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవడమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాను విడుదల చేయడానికి అందరూ చాలా కష్టపడ్డారు. సినిమా ఇంత పెద్ద హిట్‌ కావడానికి ఇండస్ట్రీ, మీడియా, ప్రేక్షకులే కారణం. సినిమాను ప్రేక్షకుల మధ్యలో చూశాం. సినిమా చూస్తుంటే మాపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకున్నాను. తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌