అవును... ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు

Monday,October 26,2020 - 12:06 by Z_CLU

తన పెళ్లిపై కొన్ని రోజులుగా వస్తున్న రూరర్లపై రియాక్ట్ అయ్యాడు SaiDharamTej. ఇప్పటివరకు వచ్చిన పుకార్లన్నీ నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లోవాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ హీరో.

కుదిరితే మరికొన్నాళ్ల పాటు పెళ్లి చేసుకోకుండా సోలో లైఫ్ ఎంజాయ్ చేద్దామనుకున్నాడు సాయితేజ్. కానీ ఇంట్లో నుంచి దాదాపు ఏడాది ఒత్తిడి పెరిగిపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల మధ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట

మరోవైపు తనకు చిరంజీవి సంబంధాలు చూస్తున్నారనే విషయం కూడా నిజమని ఒప్పుకున్నాడు తేజ్. అయితే ఇప్పటివరకు ఏ సంబంధం చూడలేదని, ఇంట్లో వాళ్లు మంచి సంబంధం తీసుకొచ్చి చూడమని చెబితే అప్పుడు ఆలోచిస్తానంటున్నాడు.