మెగాహీరో సినిమాకు ముహూర్తం ఫిక్స్

Sunday,September 17,2017 - 10:51 by Z_CLU

వీవీ వినాయక్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ముహూర్తం సెట్ అయింది. దసరా సందర్భంగా ఈనెల 27 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారు. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. వినాయక్ ఆస్థాన రచయిత ఆకుల శివ ఈ సినిమాకు కథ అందించాడు.

ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. దుర్గ లేదా ఇంటలిజెంట్ టైటిల్స్ లో ఒకటి ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. కథ ప్రకారం సినిమా మ్యాగ్జిమమ్ షూటింగ్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించనుంది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. జవాన్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన ఈ మెగా హీరో.. తాజాగా ఒకేసారి రెండు సినిమాలు స్టార్ట్ చేశాడు. వాటిలో ఒకటి వినాయక్ సినిమా కాగా, ఇంకోటి కరుణాకరన్ దర్శకత్వంలో రాబోతున్న లవ్ ఎంటర్ టైనర్. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తాయి.