తేజు నుంచి ముచ్చటగా మూడో సినిమా

Tuesday,October 17,2017 - 10:03 by Z_CLU

ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. త్వరలోనే కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు ముచ్చటగా మూడో సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు ఈ మెగా హీరో. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు ప్రకటించాడు.

సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త సినిమా ఎనౌన్స్ చేశారు. ఇంతకుముందు తేజు-మలినేని కాంబినేషన్ లో విన్నర్ సినిమా వచ్చింది. అందులో సాయిధరమ్ తేజ్ యాక్టింగ్, డాన్స్, కామెడీకి మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ ను రిపీట్ చేస్తోంది బాలాజీ సినీ మీడియా. భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ఇంతకుమించి డీటెయిల్స్ వెల్లడించలేదు. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తారు. అయితే ఈ మూవీ సెట్స్ పైకి రావడానికి టైం పడుతుంది. కరుణాకరన్ తో చేయాల్సిన సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే ఇది ప్రారంభమౌతుంది.