పెళ్లి చేసుకోబోతున్న Sai Dharam Tej

Monday,October 05,2020 - 01:06 by Z_CLU

లాక్ డౌన్ లో Nikhil Siddharth, Nithin, Rana పెళ్లి చేసుకొని ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో మరో యంగ్ హీరో కూడా చేరడానికి రెడీ అవుతున్నాడు. Solo Brathuke So Better సినిమాలో నో పెళ్లి అంటూ పాడుకున్న మెగా సుప్రీమ్ హీరో Sai Dharam Tej త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అయితే తేజ్ చేసుకోబోయేది ప్రేమ పెళ్లి కాదు. పెద్దలు కుదిర్చిన సంబంధం అట.

అవును.. తమ బంధువుల్లో ఒకమ్మాయిను తేజ్ పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతున్నాడని సమాచారం. తాజాగా సాయి ధరం తేజ్ తల్లి తన అన్నయ్య చిరంజీవి తో కలిసి ఈ సంబంధం ఫిక్స్ చేసారని తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లో వీరిద్దరికీ పెళ్లి కానుంది. ఈ లోపు కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసి ఫ్రీ అవుతాడు తేజ్.