డిఫెరెంట్ లుక్ లో సాయి ధరమ్ తేజ్

Saturday,July 14,2018 - 12:39 by Z_CLU

సాయి ధరమ తేజ్ నెక్స్ట్  సినిమా  త్వరలో  సెట్స్  పైకి  రానుంది.   త్వరలో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సెట్స్ పైకి రానున్న ఈ హీరో, మేకోవర్ కోసం U . S . కి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో తేజ్ ప్లే చేయనున్న క్యారెక్టర్  డీటేల్స్ అయితే ప్రస్తుతానికి  బయటికి రాలేదు కానీ, తేజ్ ని ఈ సారి కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫిలిం మేకర్స్.

ఓ వైపు యాక్షన్ బేస్డ్ సినిమాలు చేస్తూనే, మరో వైపు లవ్ ఎంటర్ టైనర్స్ తో  మెస్మరైజ్ చేస్తున్న తేజ్, ఇప్పటి వరకు డిఫెరెంట్ స్టోరీస్ పిక్ చేసుకున్నాడు కానీ, మేకోవర్ విషయంలో పెద్దగా ఎక్స్ పెరిమెంట్స్ చేయలేదు. అందుకే ఈ సినిమాలో తేజ్ కొత్త లుక్ లో అనేసరికి, న్యాచురల్ గానే ఈ టాపిక్ ఫ్యాన్స్ లో  ఇంట్రెస్టింగ్  డిస్క ర్షన్  పాయింట్ లా మారింది.

ఈ సినిమాలో తేజ్ సరసన రితికా సింగ్ తో పాటు కళ్యాణి ప్రియదర్శన్ నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ని వీలైనంత త్వరలో సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.