మరో సినిమా రెడీ చేసిన మెగా హీరో

Friday,April 06,2018 - 06:28 by Z_CLU

మొన్నటికిమొన్న ఇంటిలిజెంట్ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్, అప్పుడే మరో సినిమాను విడుదలకు సిద్ధంచేశాడు. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ హీరో చేస్తున్న మూవీ దాదాపు ఓ కొలిక్కి వచ్చేసింది. ఏప్రిల్ 25 నాటికి 2 పాటలు మినహా టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.

మిగిలిన ఆ 2 పాటల్ని మే ఫస్ట్ వీక్ లో ఫ్రాన్స్ లో తీయబోతున్నారు. దాంతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. త్వరలోనే ఈ సినిమాకు ఓ టైటిల్ ఫిక్స్ చేస్తామని, ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న టైటిల్స్ లో నిజం లేదని ప్రకటించింది యూనిట్

ప్యూర్ లవ్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజూ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. జులై లేదా ఆగస్ట్ లో సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.