‘జవాన్’ ట్రైలర్ అదిరింది

Thursday,November 23,2017 - 12:18 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ ‘జవాన్’ ట్రైలర్ రిలీజ్ అయింది.  BVS రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ డిసెంబర్ 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తే, ఇప్పుడీ ట్రైలర్ ఫ్యాన్స్ లో మరింత డిమాండ్ ని క్రియేట్ చేస్తుంది.

సరిహద్దుల్లో సైనికుడు ఎంత అవసరమో, దేశానికి అవసరం వచ్చినప్పుడు ప్రతి కుటుంబంలో ఒకరు జవాన్ లా సిద్ధం కావాలి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా  ఆక్టోపస్ మిసైల్ సిస్టమ్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఆక్టోపస్ మిసైల్ ని మిలిటరీ కి దక్కనివ్వకుండా తన చేతుల్లోకి తీసుకోవాలనుకునే పాత్రలో స్టైలిష్ విలన్ లా ప్రసన్న ఎట్రాక్ట్ చేస్తుంటే, హీరోగా సాయి ధరమ్ తేజ్ అటు ఫ్యామిలీ, రొమాన్స్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ లో ఇరగదీశాడనిపిస్తుంది.

దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన మెహరీన్ కౌర్ నటించింది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.