డిసెంబర్ 1న "జవాన్" గ్రాండ్ రిలీజ్

Saturday,October 21,2017 - 12:53 by Z_CLU

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు, టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు. కృతజ్ఞత….. అంటూ… దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ కి అందరూ ఫిదా అయ్యారు.  సాయి ధరమ్ తేజ్ ని కొత్తగా చూపించబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. టీజర్లో తమన్ రీ రికార్డింగ్, కెవి గుహన్ సినిమాటోగ్రఫి హైలైట్ గా కనిపిస్తోంది. దీంతో పాటు ఈ చిత్ర ప్రమోషన్ ను సైతం వినూత్న రీతిలో… ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. పబ్లిసిటీలో మరో కోణాన్ని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నారు.

నటీనటులు – సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు
కెమెరా మెన్ – కెవి గుహన్
మ్యూజిక్ – తమన్
ఆర్ట్ – బ్రహ్మ కడలి
ఎడిటింగ్ – ఎస్.ఆర్.శేఖర్, మధు
సహ రచయితలు – కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి
పి.ఆర్‌.ఓ – ఏలూరు శ్రీను
బ్యానర్ – అరుణాచల్ క్రియేషన్స్
సమర్పణ – దిల్ రాజు
నిర్మాత – కృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – బివిఎస్ రవి