సాయి ధరమ్ తేజ్ 'జవాన్' ఫస్ట్ లుక్...

Wednesday,June 21,2017 - 06:00 by Z_CLU

మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా బి.వి.ఎస్.రవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘జవాన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.. డైరెక్టర్ బి.వి.ఎస్ రవి పుట్టిన రోజును పురస్కరించుకొని ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా లో రిలీజ్ చేసారు.. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే టాకీ పార్ట్ ఫినిష్ చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడే జవాన్ ఎంత అవసరమో, ప్రతి కుటుంబానికి అలాంటి జవాన్ కూడా అంతే అవసరం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంటికొక్కడు అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాకు కృష్ణ నిర్మాత.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. విన్నర్ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ నుంచి వస్తున్న మూవీ ఇదే.