పర్ఫెక్ట్ లవ్ స్టోరీతో వస్తున్న Sai Dharam Tej

Monday,November 30,2020 - 03:42 by Z_CLU

Sai Dharam Tej నుండి పర్ఫెక్ట్ లవ్ స్టోరీ రాబోతుంది. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న Solo Brathuke So Better చక్కని ప్రేమకథతో సాగే సినిమా అని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. తేజ్ -నభా లవ్ ట్రాక్ సినిమాకే హైలైట్ అంటున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాలోని ప్రేమకథను ప్రతిబించేలా ఉన్నాయి.

సోలో జీవితానికి ఫిక్సయిన ఓ కుర్రాడు ఓ అందమైన అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథాంశంతో ఆకట్టుకునే కథనంతో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని ఎట్రాక్ట్ చేసి సూపర్ హిట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.

SVCC బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. S Thaman మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి త్వరలోనే మిగతా పాటలు కూడా విడుదల కానున్నాయి. Zee Studios ఈ సినిమాను విడుదల చేస్తుంది.

Also Check డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’