సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూ

Thursday,February 08,2018 - 03:20 by Z_CLU

వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కింది ఇంటిలిజెంట్ మూవీ. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్ తో పాటు మాస్ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తుంది. అల్ట్రా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్.  అవి మీకోసం…

అదే నా క్యారెక్టర్…

చిన్నప్పటి నుండి తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం ఇష్టం లేని వాడు, ఒకానొక సిచ్యువేషన్ లో ఆ జోన్ నుండి బయటికి వస్తాడు. ఆ ప్రాసెస్ లో హీరో ఎంత ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేశాడు…? తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి..? అన్న దానిపైనే నా క్యారెక్టర్ బిల్డ్ అయింది.

 

అండర్ లైన్ మెసేజ్…  

సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అండర్ లైన్ గా ఒక మెసేజ్ ఉంటుంది. మనకు సహాయం చేసిన వారికి మన అవసరం వచ్చినప్పుడు వాళ్ళను మరిచిపోకూడదు. వాళ్లకు తోడుగా ఉండటం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. ఈ లైన్ పైనే కంప్లీట్ స్టోరీ డెవెలప్ అయింది.

ప్రతి సినిమా అలాగే చేస్తాం…

చేసే ప్రతి సినిమా మంచి బ్రేక్ నిస్తుందనే చేస్తాం. ఇక సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి మన చేతిలో ఉండవు. ఏ సినిమా చేసినా ప్రయత్నం మాత్రం 100%  చేస్తాం. ఈ సినిమా కంపల్సరీగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందనే నమ్ముతున్నా…

థాంక్స్ చెప్పుకోవాలి…

మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ తరవాత వినాయక్ గారు చేసిన సినిమా ఇది. నా వరకు వస్తే నా ప్రీవియస్ 4 సినిమాలు అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అలాంటిది అంత సక్సెస్ మోడ్ లో ఉన్న వినాయక్ గారు నాకు ఇంత మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పుకోవాలి. ఆయనతో పని చేశాక ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో అని చేస్తే ఇలా ఉంటుందా అనిపించింది. ఆయన ఏ సీన్ చేయించుకున్నా చిరునవ్వుతో చేయించుకుంటారు.

కథే రీజన్….

వినాయక్ గారి డైరెక్షన్ లో సినిమా అనగానే డెఫ్ఫినేట్ గా ఎగ్జైట్ అయ్యాను. కానీ వినాయక్ గారు సినిమా చేయాలనుకున్నా కథే రీజన్. నేను చేయాలనుకున్నా కథే రీజన్.

ఎవరినీ నిందించలేం…

ఒక సినిమా ఫ్లాప్ అయితే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మనం చెప్పదలుచుకున్నది సరిగ్గా చెప్పలేకపోతే డెఫ్ఫినేట్ గా సినిమా ఫ్లాప్ అవుతుంది. అలాగని మనం ఒకరిని బ్లేమ్ చేయలేం. సినిమా అంటేనే కలెక్టివ్ ప్రాసెస్. ఫెయిల్యూర్స్ నుండి కూడా చాలా నేర్చుకోవచ్చు. ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు.

జవాన్ చాలా నచ్చింది…

జవాన్ సినిమా చాలా ఇష్టపడి చేశాను. విలన్ ఇంట్లోనే ఉండటం, అది తెలీక హీరో విలన్ కోసం వెదుక్కోవడం, స్టోరీ లైన్ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. కానీ అది స్క్రీన్ పై అందరికీ రీచ్ అయ్యేలా ట్రాన్స్ లేట్ అవ్వలేదు.

 

నేనెప్పుడూ ఇన్వాల్వ్ కాను…

ఒకసారి కథ నచ్చి ఓకె చెప్పేశాక మళ్ళీ ఆ స్టోరీలో నేను కలగజేసుకోను. సినిమా కంప్లీట్ గా డైరెక్టర్ విజన్ ప్రకారమే ఉంటుంది. నటించడం తప్ప నేనేం చేయను…

నేనదే చేస్తున్నాను…

ఇలాంటి సినిమాలే చేయాలి. ఇవి చేయకూడదు అని నేనేమీ పెట్టుకోలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు మనకు  నచ్చిన అవకాశాలే రావాలి.. ఇవే చేయాలి అని రూల్ పెట్టుకోకుండా మనకు వచ్చిన అవకాశాల్ని ఎలా యుటిలైజ్ చేసుకున్నామా అన్నదే ఇంపార్టెంట్. నేను అదే చేస్తున్నాను.

అది వినయ్ గారి ఆలోచన…

నాలో మా ఇద్దరు మావయ్యల పోలికలున్నాయని వినయ్ గారు అనుకున్నారు. అందుకే  సాంగ్స్ లో అలా చూపించడానికి ట్రై చేశారు. ఇక ‘చమక్ చమక్’ సాంగ్ విషయంలో కూడా నా ఇన్వాల్వ్ మెంట్ ఏమీ లేదు. ప్రొడ్యూసర్స్ అనుకున్నారు. డైరెక్టర్ చెప్పారు కాబట్టి నేను చేశాను అంత వరకే….

నా ఫీలింగ్ అదే…

నా సినిమా, వరుణ్ సినిమా ఒకరోజు రిలీజైనా నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకైతే మా ఇద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయి హిట్టయితే ఆ కిక్ ఇంకోలా ఉండేది. అయినా వరుణ్ సినిమా ఒక రోజు పోస్ట్ పోన్ అయింది కాబట్టి అది కూడా హ్యాపీనే… మా మధ్య కాంపిటీషన్ లాంటిది ఎప్పుడూ ఉండదు…

ప్రభాస్ ఆడియో లాంచ్ కి రావడం….

రెబల్ స్టార్ ప్రభాస్ మా సినిమా ఆడియో లాంచ్ కి రావడం, బాలకృష్ణ గారు కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళిద్దరికీ మనస్పూర్తిగా థాంక్స్….

బడ్జెట్ దాటలేదు…

సినిమా బడ్జెట్ బిగినింగ్ లో ఫిక్స్ చేసుకున్నారు. C. కళ్యాణ్ గారు సినిమా రిచ్ గా ఉండాలి అని ముందు నుండే ప్రిపేర్డ్ గా ఉన్నారు కాబట్టి బడ్జెట్ దాటలేదు. అంతా ప్లానింగ్ ప్రకారమే జరిగింది.

ఇబ్బందిగా అనిపిస్తుంది…

నన్ను చిరంజీవి గారితో పోలుస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలిసి చిరంజీవి గారు ఒక్కరే. ఆయన్ని రీచ్ అవ్వడం కష్టం.

 

వెరీ స్వీట్ గర్ల్…

లావణ్యకి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. తొందరగా కలిసిపోతుంది కాబట్టి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అయింది. ఇక ఆఫ్ స్క్రీన్ ఎప్పుడూ నవ్విస్తూంటుంది కాబట్టి తను సెట్ లో ఉన్నంత సేపు సరదాగా ఉంటుంది.

రెస్పాన్సిబిలిటీగా చేశాను…

నేనెప్పుడూ చిరంజీవి గారి సాంగ్స్ రీమిక్స్ చేస్తాను అని అడగలేదు. డైరెక్టర్స్ చెప్తేనే చేస్తాను. నా వరకు నేను ఆ సాంగ్ కి ఎంతవరకు కష్టపడాలో అంత వరకు కష్టపడతాను. ఇప్పటివరకు చేసిన 4 సినిమాలు అంతే బాధ్యతగా చేశాను…

షాక్ అయ్యాను…

రాజమండ్రిలో ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ ని చూసి నిజంగా షాక్ అయ్యాను. అది ఓపెన్ ఫంక్షన్ కాబట్టి  అందరికీ లెటర్స్ పంపించాం. కానీ వాళ్ళు మాత్రం అంత ఓపిగ్గా అందరూ మాట్లాడేది విని, మమల్ని రిసీవ్ చేసుకున్న విధానం, వాళ్ళు మాపై చూపిన ప్రేమకి నిజంగా వాళ్లకు రుణపడి ఉంటాను.

కరుణాకరన్ సినిమా…

కరుణాకరన్ గారి సినిమా ఆల్ రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఫిబ్రవరి 19 నుండి కొత్త షెడ్యూల్ బిగిన్ అవుతుంది.

ఇద్దరు చాలా వేరు…

కరుణాకరన్ గారితో పని చేయాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. లక్కీగా అవకాశం వచ్చింది చాలా హ్యాప్పీ… కానీ వినాయక్ గారితో సినిమా అనేది ఆలోచన కూడా లేదు. అందునా మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ తరవాత, ఆయన సినిమాలో చేయడమనేది నెవర్ ఎక్స్ పెక్టెడ్… ఇద్దరూ డిఫెరెంట్ డైరెక్టర్స్… చాలా చాలా హ్యాప్పీ…