ఇంటలిజెంట్ గా మారిన జవాన్

Thursday,January 04,2018 - 11:21 by Z_CLU

ధర్మ భాయ్, ఇంటలిజెంట్, దుర్గ.. ఇలా చాలా పేర్లు చర్చకొచ్చాయి. ఒక దశలో ధర్మా భాయ్ అనే పేరు ఫైనల్ చేస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ ఫైనల్ గా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమాకు ఇంటలిజెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా మస్కట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.

వినాయక్-తేజు కాంబినేషషన్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ ఇది. మరీ ముఖ్యంగా ఖైదీ నంబర్ 150 లాంటి సూపర్ హిట్ తర్వాత వినాయక్ డైరక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇంటలిజెంట్ టైటిల్ తో త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇంటలిజెంట్ లో సాయిధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయాలని అనుకుంటున్నారు.