సాయిధరమ్ తేజ్ సినిమాపై క్లారిటీ

Friday,July 13,2018 - 02:51 by Z_CLU

ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. తేజ్ I love u రిలీజ్ తరవాత మాత్రి మూవీస్ బ్యానర్ లో కిశోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కాన్సంట్రేషన్… తేజ్, గోపీచంద్ మాలినేని కాంబోలో తెరకెక్కాల్సి ఉన్న సినిమాపై ఉంది.

ఈ మధ్య ఈ సినిమా గురించి ఫిల్మ్ మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి సినిమా ఆగిపోయిందా..? అనే క్వశ్చన్స్ కూడా ఫ్యాన్స్ లో రేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ కన్ఫ్యూజన్ కి జస్ట్ ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టేశాడు దర్శకుడు గోపీచంద్ మాలినేని. ఈ సినిమా ఆగిపోలేదని త్వరలో ఈ సినిమాకి సంబంధించిన డీటేల్స్ ని అనౌన్స్ చేస్తామని క్లియర్ చేశాడు గోపీచంద్ మాలినేని.

విన్నర్ తరవాత మరోసారి సెట్స్ పైకి రానున్న ఈ కాంబోపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. మరి తేజ్ కిషోర్ తిరుమల సినిమా కంప్లీట్ అయ్యాక, గోపీచంద్ తో సినిమా చేస్తాడా..? లేకపోతే ఈ రెండు సినిమాలకు  సైమల్టేనియస్ గా పని చేస్తాడా..? అనేది చూడాలి.