సాగర్ మహతి ఇంటర్వ్యూ

Sunday,January 28,2018 - 12:46 by Z_CLU

నాగశౌర్య, రష్మిక జంటగా నటించిన ‘ఛలో’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ టాక్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ సాగర్ మహతి ఈ సినిమా ఆడియో మేకింగ్ ప్రాసెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఆ చిట్ చాట్ మీకోసం…

చాలా హ్యాప్పీ….

నాకసలు ఏమీ తెలీదు.. ఒక రకంగా చెప్పాలంటే బావిలో కప్పలాంటి వాడిని.. అలాంటిది చలో ఫస్ట్ సాంగ్ ఈ రేంజ్ లో సక్సెస్ అయిందంటే, డైరెక్టర్ ఒక మంచి సిచ్యువేషన్ ఇవ్వడం, ఫిల్మ్ మేకర్స్ దాన్ని అలాగే ప్రమోట్ చేయడం అన్నీ అలా కలిసొచ్చాయి… ఇండస్ట్రీ లో కూడా చాలామంది అప్రీషియేట్ చేశారు… చాలా హ్యాప్పీ…

నాన్న ఇన్ఫ్లుయెన్స్ తక్కువే….

నా సాంగ్స్ లో నాన్న ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉండదు.. నాకేదైనా డౌటుంటేనే ఆయన్ని అడుగుతాను. లేకపోతే నా స్టైల్ నేను ఫాలో అయిపోతాను. డిఫెరెంట్ గా ఏదైనా చేసినప్పుడే సక్సెస్ అవుతుందని నా ఫీలింగ్…

పర్టికులర్ ప్లాన్ ఏం ఏం లేదు…

నాన్నని మెలోడీ ఎక్స్ పర్ట్ అన్నారు కదాని నేను కూడా ఏదో ఒక జోనర్ లో స్పెషలిస్ట్ అనిపించుకోవాలి అనే ఆలోచన లేదు. ఏదైనా సినిమాని బట్టి సిచ్యువేషన్స్ బట్టి, స్పెషల్ గా డైరెక్టర్ టేస్ట్ ని బట్టి ఉంటుంది.

‘చూసి చూడంగానే’ అలా జరిగింది…

నిజానికి సాంగ్ చేద్దామని చేసింది కాదు, లవ్ థీమ్ చేద్దామని బిగిన్ చేశాము. ఆ తరవాత ఇదేదో బావుందనిపించి సాంగ్ బిట్ చేద్దామనుకున్నాము … అది ఇంకా బాగా వచ్చేసరికి, ఇక డిసైడ్ అయిపోయి సాంగ్ చేసేశాము….

 

సాంగ్స్ వేరు BGM వేరు….

సాంగ్స్ వేరు.. BGM వేరు… సాంగ్స్ ఎవరైనా కంపోజ్  చేసేయగలరు. కానీ BGM చేయడానికి చాలా ప్యాషన్ ఉండాలి. అదొక సెపరేట్ స్కూల్. లక్కీగా నాకు మా ఇంట్లోనే టీచర్ ఉన్నారు. నాన్నగారు BGM ఎక్స్ పర్ట్. అలా నా విషయంలో కొంచెం ఈజీ అయింది….

అందుకే చెన్నై…

చెన్నై లో చాలా మంది మ్యూజిషియన్స్ ఉన్నారు. అందుకే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చెన్నై ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. మ్యూజీషియన్స్ చాలా తక్కువ.  బిగినింగ్ లో నాక్కూడా ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామా అనిపించేది. కానీ ఇప్పుడు మా సొంత టీమ్  ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఎక్కడైనా రికార్డ్ చేయొచ్చు…

కొలాబరేషన్ అంటే నాకు చాలా ఇష్టం…

ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికీ కాంపిటీషన్ కాదు, నాన్న గారితో కూడా నాకు అలా ఏం ఉండదు. ఇట్స్ ఎ కొలాబరేషన్ ప్రాసెస్. డిస్కస్ చేయడం వల్ల ఇంకా మంచి ఐడియాస్ వస్తాయి.

ఆయన నాకు ఇన్స్ పిరేషన్

యువన్ శంకర్ రాజా నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. ఇళయరాజా గారి అబ్బాయి అయి ఉండి కూడా, ఆయన షేడ్స్ తన మ్యూజిక్ ఇంపాక్ట్, తన సాంగ్స్ పై పడకుండా, ఆయన సాంగ్స్ కంపోజ్ చేసుకునే తీరు అమేజింగ్. వండర్ ఫుల్ మెలోడీస్ చేశారాయన…

నాన్నగారు గ్యాప్ తీసుకోలేదు….

నాన్నగారు మ్యూజిక్ చేసిన కొన్ని సినిమాలు వరసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆయన సినిమాలు చేయడం లేదు అనుకున్నారంతా… నాన్న గారు సినిమాలు చేస్తూనే ఉన్నారు. సక్సెస్ మ్యాటర్స్…. సక్సెస్ ఉంటేనే మనం కనిపిస్తాం… లేకపోతే లేదు…

ఛలో ఆల్బమ్ లో మోస్ట్ ఫేవరేట్…

ఈ ఆల్బమ్ లో నా ఫస్ట్ ఫేవరేట్ ‘చూసి చూడంగానే’, నెక్స్ట్ ‘అమ్మాయే ఛలో అంటూ..’

నెక్స్ట్ ప్రాజెక్ట్….

ప్రస్తుతం ‘కుమారి 21 F’ కన్నడ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అంతే…