జులై 27న సాక్ష్యం గ్రాండ్ రిలీజ్

Tuesday,July 24,2018 - 11:30 by Z_CLU

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.. ప్రపంచవ్యాప్తంగా జులై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ డాల్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి.

సాంగ్స్ కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా 12 నిమిషాల పంచభూతాలు సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తోంది..హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మరియు మీనా లు నటించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురు స్వామి, జే ప్రకాష్, పవిత్రా లోకేష్ మరియు వెన్నెల కిషోర్.

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: శ్రీవాస్
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అభిషేక్ నామా
సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: ఆర్థర్ ఎ విల్సన్
కళ: ఎఎస్ ప్రకాష్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
మాటలు: సాయి మాధవ్ బుర్రా
యాక్షన్: పీటర్ హెయిన్
PRO: వంశీశేఖర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
ఆడియో: జంగిల్ మ్యూజిక్