సాక్ష్యంలో సౌందర్య లహరి

Thursday,May 03,2018 - 04:04 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సాక్ష్యం. శ్రీవాస్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజైంది. దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సో.. ఇదే ఊపులో బ్యాక్ టు బ్యాక్ సింగిల్స్ కూడా రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది సాక్ష్యం యూనిట్. ఇందులో భాగంగా రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.

సౌందర్య లహరి అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను రేపు రిలీజ్ చేయబోతున్నారు. సినిమాలో మెయిన్ హైలెట్ ఈ పాటే అని తెలుస్తోంది. హర్షవర్థన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మ్యూజిక్ డైరక్టర్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడనే విషయం టీజర్ చూస్తే అర్థమైంది. ఇక పాటలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయనే విషయం రేపట్నుంచి తెలుస్తుంది.


మరోవైపు ఈ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు చేరుకుంది. సారధి స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో హీరోయిన్ పూజా హెగ్డే, హీరో మధ్య ఓ సాంగ్ తీస్తున్నారు. ఇవాళ్టితో ఈ పాట షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంతేకాదు.. ఈ షెడ్యూల్ తో టోటల్ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా తెరకెక్కుతోంది సాక్ష్యం.