పాటలతో సందడి చేయనున్న సాక్ష్యం

Thursday,July 05,2018 - 01:30 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అప్ కమింగ్ మూవీ సాక్ష్యం. శ్రీవాస్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. అంతకంటే ముందు పాటలతో సందడి చేయడానికి సిద్ధమైంది. అవును.. ఈ సినిమా ఆడియోను ఈ శనివారం గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. శిల్పకళావేదికలో సాయంత్రం 6 గంటల నుంచి సాక్ష్యం పాటల హంగామా మొదలుకానుంది.

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మాతగా తెరకెక్కుతోంది సాక్ష్యం మూవీ. బెల్లంకొండ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా ఇదే. ఇప్పటికే టీజర్ కు ట్రమండస్ రెస్పాన్స్ రావడం, లేటెస్ట్ సెన్సేషన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడంతో సాక్ష్యంపై క్రేజ్ డబుల్ అయింది.

హర్షవర్థన్ రామేశ్వరన్ ఈ సినిమాకు ట్యూన్స్ అందించాడు. మూవీలో ఓ పాటను ఏకంగా ఐదుగురు టాప్ సింగర్స్ ఆలపించడం విశేషం. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఏసుదాస్, హరిహరన్ , కైలాష్ ఖేర్, బాంబే జయశ్రీ కలిసి ఆలపించిన ఓ పాట టోటల్ సినిమాకే హైలెట్ కానుందట. దీనికితోడు సాయిశ్రీనివాస్ చేసిన స్టంట్స్ సినిమాకు మేజర్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.