సాహో ‘విలన్స్’ – డిఫెరెంట్ స్టోరీస్

Saturday,August 10,2019 - 09:48 by Z_CLU

‘సాహో’ లో హీరో హీరోయిన్స్  తో పాటు, మరో 7 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి. అయితే వీళ్ళలో ఒకొక్కరికి ఒక్కో ప్రత్యేకత… అయితే ఈ క్యారెక్టర్స్ ని రివీల్ చేసీ చేయనట్టు, జస్ట్ ట్యాగ్ లైన్స్ తో పోస్టర్స్ ని రివీల్ చేశారు మేకర్స్.

ఈ ట్యాగ్ లైన్స్ కంప్లీట్ క్యారెక్టర్ ని రివీల్ చేయకపోయినా, ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లో ఒక్కొక్కరికి డిఫెరెంట్ స్టోరీ ఉంటుందని మాత్రం అర్థమవుతుంది.

నీల్ నితిన్ ముకేష్ : సినిమాలో పేరు జయ్ – సినిమాలో మోస్ట్ మిస్టీరియస్ క్యారెక్టర్. ‘The end does not answer everything’ అనే ట్యాగ్ లైన్ తో ఈ క్యారెక్టర్ కి పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది.

అర్జున్ విజయ్ – సినిమాలో పేరు విశ్వాంక్ – ఓ రకంగా చెప్పాలంటే ‘సాహో’ లో యుద్ధం లాంటివాడు. సినిమాలో ప్రభాస్ తలపడే మోస్ట్ పవర్ ఫుల్ విలన్ రోల్ ఇదే.

చుంకీ పాండే : సినిమాలో పేరు దేవరాజ్ – ఆల్మోస్ట్ అయిపోయాడు అన్న టైమ్ లో విరుచుకుపడే క్యారెక్టర్. ‘Rise from the Ashes’ అనే ట్యాగ్ లైన్, సినిమాలో ఈ క్యారెక్టర్ ‘దెబ్బ తిన్న పులి’ తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది.

జాకీ ష్రాఫ్ – సినిమాలో పేరు రాయ్- తనకు నచ్చినదే శాసనం. ‘ Say YES or die’ అనే ట్యాగ్ లైన్, సినిమాలో  ఈ క్యారెక్టర్ నియంతలా ఉండబోతుందనే సిగ్నల్స్ ఇస్తుంది.

లాల్ – సినిమాలో పేరు ‘ఇబ్రహీం’. ‘Beware Of Loyalty’ అనే ట్యాగ్ లైన్ క్యారెక్టరిస్టిక్స్ ని రివీల్ చేసినా ఎవరికీ లాయల్ గా ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

మురళీ శర్మ – ‘The Chosen One’ ఇదే మురళీశర్మ క్యారెక్టర్ కి మేకర్స్ ఇచ్చిన ట్యాగ్ లైన్. ‘డేవిడ్’ లా కనిపించబోతున్నాడు సినిమాలో. కాకపోతే ఈ డేవిడ్ ఎవరి చేత ఎంచుకోబడ్డాడు అనేది సినిమా రిలీజైతేనే తెలుస్తుంది.

మందిరా బేడీ : ‘కల్కి’ గా కనిపించనుంది మందిరా బేడీ. ‘Good Is Bad’ అనే ఈ క్యారెక్టర్ ట్యాగ్ లైన్ ని బట్టి, ఈ క్యారెక్టర్ కంప్లీట్ గా ఫుల్ ఆఫ్ పాయిజన్ థాట్స్ తో ఉండబోతుందనిపిస్తుంది.