మోస్ట్ ఎవెయిటింగ్ షెడ్యూల్ ప్రారంభం

Saturday,March 31,2018 - 01:16 by Z_CLU

సాహో సినిమాకు సంబంధించి మోస్ట్ ఎవెయిటింగ్ షెడ్యూల్ మొదలైంది. ఈ మేరకు యూనిట్ అంతా కలిసి అబుదాబి పయనమైంది. సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన షెడ్యూల్ ఇది. దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ముందుగా అబుదాబిలో ఈ కీలకమైన షెడ్యూల్ మొదలవుతుంది.

అబుదాబి తర్వాత దుబాయ్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండు ప్రాంతాల్లో ప్రభాస్ పై యాక్షన్ ఎపిసోడ్స్ తీయబోతున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్, ఈ స్టంట్స్ ను వెరీ వెరీ స్పెషల్ గా డిజైన్ చేశాడు. ఈ రెండు ప్రాంతాల్లో షూటింగ్స్ తర్వాత యూనిట్ అంతా కలిసి రొమేనియాకు వెళ్తుంది. అక్కడ కూడా 10 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశారు.

ఇలా సాహోకు సంబంధించిన అత్యంత కీలకమైన షెడ్యూల్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైందన్నమాట. శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేష్ విలన్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకుడు.