గెట్ రెడీ.. సాహో టీజర్ సిద్ధం

Monday,June 10,2019 - 04:22 by Z_CLU

మొన్నటివరకు షేడ్స్ ఆఫ్ సాహో అంటూ అదరగొట్టింది యూనిట్. చాప్టర్-1, చాప్టర్-2 పేరిట వచ్చిన 2 వీడియోలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సోషల్ మీడియాలో లక్షల్లో క్లిక్స్, వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అంతకుమించి హంగామా రెడీ అయింది. అవును.. సాహో టీజర్ వచ్చేస్తోంది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా టీజర్ కు ప్రస్తుతం ఫినిషింగ్ టచెస్ జరుగుతున్నాయి. అవి పూర్తిచేసి, మరో 3 రోజుల్లో (జూన్ 13న) టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఆ మరుసటి రోజు (14 నుంచి) తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సాహో టీజర్ ను ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.

బాహుబలి-2 లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ కారణంగా సాహోపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది.

సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.