'సాహో' టీజర్ రివ్యూ

Thursday,April 27,2017 - 06:53 by Z_CLU

4 ఏళ్ల పాటు ప్రేక్షకులకు కేవలం ‘మహేంద్ర బాహుబలి’, ‘శివుడు’ గా హిస్టారికల్ గెటప్స్ లో మాత్రమే కనిపించిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇట్స్ టీజర్ టైం అంటూ ‘సాహో’ స్టైలిష్ టీజర్ తో సోషల్ మీడియాలో భారీ హంగామా చేస్తున్నాడు.. నిన్నటి వరకూ బాహుబలి తరువాత ప్రభాస్ ఎలాంటి సినిమా చేస్తాడా… ఎలా కనిపిస్తాడా… అని ఎంతో క్యూరియాసిటీ తో వెయిట్ చేసిన ఫాన్స్ కు ఒకే ఒక్క టీజర్ తో సమాధానం చెప్పి ఖుషీ లో ముంచేశాడు ప్రభాస్…

 

ఇక టీజర్ విషయానికొస్తే హై టెక్నీకల్ స్టాండర్డ్స్ తో స్టార్ట్ అయిన టీజర్ చివరికి కూడా హై టెక్నీకల్ షాట్స్ తోనే పూర్తయ్యి అందరినీ ఎట్రాక్ట్ చేసింది..

ముఖ్యంగా టీజర్ లో ప్రభాస్ తన స్టైలిష్ లుక్ తో పాటు ‘ఇట్స్ షో టైం’ అంటూ కూల్ డైలాగ్ తో ఫాన్స్ తో పాటు ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేశాడు… ఇక రెండో సినిమాకే ప్రభాస్ లాంటి హీరో, పైగా 150 కోట్ల బడ్జెట్.. అవసరమా ? అనుకున్న ప్రతీ ఒక్కరికి ఒకే ఒక్క టీజర్ తో దర్శకుడిగా తన స్టామినా ఏంటో నిరూపించి తన స్టైలిష్ మేకింగ్ తో శభాష్ అనిపించుకున్నాడు సుజీత్.. ఓవరాల్ గా స్టైలిష్ మేకింగ్, హై టెక్నీకల్ షాట్స్, విజువల్ ఎఫెక్ట్స్  తో సాహో టీజర్ దుమ్ము దులిపేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటుంది…

ఈ టీజర్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో రేపు ‘బాహుబలి2’ ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో ఇంటర్వెల్ టైం లో ప్రదర్శించబోతున్నారు మేకర్స్..