"సాహో" అనిపించిన ప్రభాస్.. టీజర్ రివ్యూ

Thursday,June 13,2019 - 12:07 by Z_CLU

వర్త్ వెయిటింగ్ అంటారు కదా, అలా ఉంది సాహో టీజర్. ఆడియన్స్ వెయిటింగ్ కు ఓ చక్కని ట్రీట్ దక్కింది. సాహో టీజర్ అదిరిపోయింది. ఒక్కో ఫ్రేమ్ చూస్తుంటే, హాలీవుడ్ సినిమా ఫీలింగ్ కలిగింది.

జనరల్ గా టీజర్ లో హీరో ఎలివేషన్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇది పాన్-ఇండియా సినిమా. అందుకే ప్రభాస్ తో పాటు హీరోయిన్ శ్రద్ధాకపూర్ కు కూడా స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. అంతేకాదు, మూవీ రిచ్ నెస్, ప్రొడక్షన్ వాల్యూస్ తెలిపేలా టీజర్ కట్ చేశారు.

ఇవన్నీ ఒకెత్తయితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకదాన్ని మించి ఒకటి పోటీపడ్డాయి. సాహో టీజర్ కు ఓ లుక్, కిక్ తీసుకొచ్చింది ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ విషయంలో జిబ్రాన్ కు నూటికి నూరు మార్కులు పడతాయి.

ఇక టీజర్ లో ఎనర్జిటిక్ లుక్స్ తో అదరగొట్టాడు ప్రభాస్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు.