టీజర్ రెడీ చేస్తున్న 'సాహో' టీం

Monday,October 15,2018 - 11:10 by Z_CLU

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సాహో’ టీజర్ రెడీ అవుతుంది. గతంలో టైటిల్ అనౌన్స్ మెంట్ తో ఓ టీజర్ ను రిలీజ్ చేసిన యూనిట్  అక్టోబర్ 23 న ప్రభాస్ జన్మదిననాన్ని పురస్కరించుకొని సినిమాలోని కొన్ని స్పెషల్ సీన్స్ తో ఓ టీజర్ విడుదల చేయబోతున్నారు.. ఇప్పటికే ఈ టీజర్ కోసం ఓ స్పెషల్ టీం వర్క్ చేస్తుందని తెలుస్తుంది. అక్టోబర్ 22 న రాత్రి 12 గంటలకు టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్  చేసి ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెప్పనున్నారట మేకర్స్.

సుజీత్ డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో  తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది.