సాహో సర్ ప్రైజ్.... రేపట్నుంచి మొదలు

Monday,May 20,2019 - 12:29 by Z_CLU

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమాకు సంబంధించి రేపట్నుంచి అఫీషియల్ గా ప్రచారం ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రభాస్ ఓ చిన్న టీజర్ వీడియో బైట్ రిలీజ్ చేశారు. రేపు అందరికీ
ఓ సర్ ప్రైజ్ ఉండబోతోందని ప్రకటించాడు.

Surprise Tomorrow

Hello darlings… A surprise coming your way, tomorrow. Stay tuned…Instagram.com/ActorPrabhas

Posted by Prabhas on Sunday, 19 May 2019

ఆగస్ట్ 15న సాహోను రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి రేపట్నుంచి మెల్లగా ప్రమోషన్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం రీసెంట్ గా ప్రభాస్ పై ఓ ఫొటో షూట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఆ ఫొటోలతో ఓ పోస్టర్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

మొత్తమ్మీద ఉన్నాళ్లూ కాస్త స్తబ్దుగా ఉన్న సాహో సినిమా యూనిట్.. ఎట్టకేలకు ఫ్యాన్స్ లో జోష్ నింపే అప్ డేట్ తో వచ్చింది. సుజీత్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.